కన్నప్ప ను ఓన్ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
Prabhas fans are actively showing support for Kannappaకన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు అనగానే ప్రభాస్ అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు, మరెన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప లో మోహన్ బాబు పై గౌరవంతో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తా అన్నప్పటికీ.. మంచు విష్ణు ప్రభాస్ కి ఎలాంటి రోల్ ఇస్తారో, దాని వలన ప్రభాస్ కి మంచి జరగకపోయినా పర్లేదు, ఆయన్ని ట్రోల్ చెయ్యకుండా ఉంటే చాలని అయన ఫ్యాన్స్ ఫీలయ్యారు.
కానీ కన్నప్ప ట్రైలర్ లో రుద్ర కేరెక్టర్లో ప్రభాస్ లుక్స్ ఆయన పలికిన డైలాగ్స్, చేసిన యాక్షన్ చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి ఆలోచనా లేకుండా కన్నప్ప ను ఓన్ చేసుకుంటున్నారు. జూన్ 27 న విడుదలకాబోతున్న కన్నప్ప చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగేలా మాట్లాడుకుంటున్నారు. కన్నప్ప లో ప్రభాస్ మంచి పాత్ర పోషిస్తున్నారని సంబరపడుతున్నారు.
సినిమా ఎలా ఉన్నా కన్నప్ప లో ప్రభాస్ పాత్ర అదిరిపోతోంది, అందులో ఎలాంటి సందేహం లేదు కనక కన్నప్పను ఎలాగైనా గట్టెక్కించాలని ప్రభాస్ ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అని టాక్. మరి ప్రభాస్ ఫ్యాన్స్ వలన కన్నప్ప కు ఎంత మంచి జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Prabhas fans supporting Kannappa







































