ఆఫ్రికా అడవులకి మహేష్ బాబు

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ లేకపోయినా, అనధికారికంగా ఏ విషయాలైన తెలిస్తే చాలు అవి సెకన్స్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే SSMB 29 కి సంబందించిన భారీ షెడ్యూల్స్ పూర్తికాగా.. ఇప్పడు SSMB 29 షూటింగ్ ఆఫ్రికా అడవులకు షిఫ్ట్ కాబోతుంది అని సమాచారం.
జులై నుంచి SSMB29 టీం ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుంది అని.. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇప్పటికే ఆఫ్రికా అడవులకు సంబంధించి షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉండగా.. షూటింగ్ కి పర్మిషన్ దొరక్క టీమ్ వేచి చూస్తుంది. ఇప్పుడు అక్కడ పర్మిషన్ దొరకడంతో మహేష్ అండ్ రాజమౌళి టీం జులై మొదటివారంలో ఆఫ్రికా అడవులకు పయనమవుతుంది అని తెలుస్తుంది.
కెన్యా లో జరగబోయే ఈ భారీ షెడ్యూల్ కోసం మహేష్ బాబు అక్కడ కీలకమైన యుద్ధ విద్యలను ట్రైనింగ్ కూడా తీసుకున్నారని, ఈ షెడ్యూల్ దాదాపుగా 30 రోజులు ఉంటుంది అని తెలుస్తుంది. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ లో మహేష్-ప్రియాంక చోప్రా-పృథ్వీ రాజ్ సుకుమారన్ లపై కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తారని టాక్.
Mahesh Babu, Rajamouli and Priyanka Chopra are set to resume shooting in Africa forest
SSMB 29 shooting update








































