ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Reason behind Allu Arjun-Trivikram project being stalled

అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగడానికి కారణం

Reason behind Allu Arjun-Trivikram project being stalled

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కలిసి ఓ ప్రాజెక్టు ని అనౌన్స్ చేసారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్టుగా పదే పదే నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. తీరాచూస్తే అల్లు అర్జున్ అట్లీ తో మూవీ అనౌన్సమెంట్ చేసి అందరికి ముఖ్యంగా త్రివిక్రమ్ కి షాకిచ్చాడు. దానితో త్రివిక్రమ్ నెక్స్ట్ డైలమాలో పడింది. 

త్రివిక్రమ్ స్క్రిప్ట్ పాన్ ఇండియా మార్కెట్ కి పనికిరాదనే ఆలోచనతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని సైడ్ చేసి అట్లీ తో విజువల్ వండర్ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడనే ప్రచారం జరిగింది. ఆతరవాత త్రివిక్రమ్ లైన్ లోకి ఎన్టీఆర్ రావడం, అల్లు అర్జున్ తో అనుకున్న కథతోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారని ప్రచారం షురూ అయ్యింది. 

తాజాగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ ఆగిపోయి అల్లు అర్జున్ స్థానంలోకి ఎన్టీఆర్ రాడానికి కారణం వేరే ఉంది అంటున్నారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్నా ముందే విజువల్ గ్రాండియర్ సబ్జెక్టు తో వచ్చిన అట్లీ మూవీ ముగించి ఆతర్వాత త్రివిక్రమ్ తో చెయ్యాలని బన్నీ డిసైడ్ అయ్యి త్రివిక్రమ్ ని సంప్రదించగా.. త్రివిక్రమ్ కూడా అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేలోగా వెంకీ, ఎన్టీఆర్ సినిమాలు ప్లాన్ చేసుకున్నారని, బన్నీ-త్రివిక్రమ్ మధ్యన అండర్ స్టాండింగ్ తోనే అల్లు అర్జున్-త్రివికమ్ ప్రాజెక్ట్ ఆగింది అంటున్నారు. 

అదన్నమాట అసలు కారణం. కానీ ఇంతలోనే రకరకాల రూమర్స్ బన్నీ-తివిక్రమ్ ప్రాజెక్ట్ పై చక్కర్లు కొట్టాయి. 

Is this the reason for the Allu Arjun-Trivikram fallout

allu arjun