చప్పుడు చెయ్యని కింగ్ డమ్

Kingdom release date confusion

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన పాన్ ఇండియా ఫిలిం కింగ్ డమ్ జులై 4 న వస్తుందా, లేదంటే సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అనే కన్ఫ్యూజన్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు. కారణం సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల సమయమే ఉంది. ఆ రోజే విడుదల కాబోతున్న తమ్ముడు ప్రమోషన్స్ జోరుగా మొదలయ్యాయి. 

కానీ పాన్ ఇండియా మూవీ కింగ్ డమ్ ప్రమోషన్స్ మొదలు కాలేదు. కారణం సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉండబట్టే కింగ్ డమ్ టీం సైలెంట్ గా ఉంది అంటున్నారు. మరి కింగ్ డమ్ పోస్ట్ పోన్ ని కన్ ఫర్మ్ చేసి అదేదో కొత్త డేట్ లాక్ చేస్తే సరి. కానీ మేకర్స్ అలా చెయ్యకుండా చివరి నిమిషం వరకు అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 

లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో డిజప్పాయింట్ మోడ్ లో ఉన్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తో కమ్ బ్యాక్ అవుతారని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ కింగ్ డమ్ పదే పదే పోస్ట్ పోన్ అవడమే వారికి మింగుడు పడడం లేదు. 

Vijay Deverakonda Kingdom Release Postponed Again?

kingdom