Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hrithik and Rakesh Roshan sell 3 Andheri West properties

నిర్మాత రియ‌ల్ బిజినెస్ జోరు

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోషన్ - ఆయ‌న తండ్రి, క్రిష్‌ నిర్మాత రాకేష్ రోషన్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో మూడు నివాస ఆస్తులను రూ.6.75 కోట్లకు విక్రయించారని స‌మాచారం. మేలో ఈ లావాదేవీలు జ‌రిగాయి. స్క్వేర్ యార్డ్స్ పత్రాల వివ‌రాల‌ ప్రకారం.. అంధేరి వెస్ట్‌లోని వీజేస్ నివాస్ సీహెచ్ ఎస్ లిమిటెడ్‌లో ఉన్న‌ ఆస్తిని రాకేష్ రోషన్ విక్రయించారు. దీని విలువ రూ.3.75 కోట్లు. ఇది 95.26 చదరపు మీటర్లు (సుమారు 1,025 చదరపు అడుగులు) విస్తీర్ణం క‌లిగి ఉంది. రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ లావాదేవీలో రూ.18.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. రెండవ ఆస్తి అంధేరి వెస్ట్‌లోని రహేజా క్లాసిక్‌లో ఉంది. ఈ ఆస్తిని కూడా రాకేష్ రోషన్ విక్రయించారు. దీని విలువ సుమారు రూ.2.20 కోట్లు. దీని నిర్మాణ ప్రాంతం 60.89 చదరపు మీటర్లు (దాదాపు 655 చదరపు అడుగులు). ఈ లావాదేవీకి రూ. 13.20 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. 

మూడవ ఆస్తి కూడా అంధేరి వెస్ట్‌లోని రహేజా క్లాసిక్‌లో ఉంది. దీనిని హృతిక్ రోషన్ విక్రయించారు. దీని విలువ రూ. 80 లక్షలు. ఈ ఆస్తి 22.30 చదరపు మీటర్లు (దాదాపు 240 చదరపు అడుగులు)స్పేస్ లో ఉంది. ఈ లావాదేవీలో రూ. 4.80 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి.

అంధేరి వెస్ట్ ముంబైలో రియ‌ల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్క‌డ వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల్ని సెల‌బ్రిటీలు పెట్టారు. ఇది రోడ్డు, రైలు మరియు మెట్రో ద్వారా బలమైన కనెక్టివిటీని క‌లిగి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), SEEPZ,  లోయర్ పరేల్ వంటి ప్రధాన బిజినెస్ జిల్లాలకు దగ్గరగా వ్యూహాత్మకంగా ఉంది. అందువ‌ల్ల ఇక్క‌డ నివాస ఆస్తులు, వాణిజ్య ఆస్తుల‌కు డిమాండ్ ఉంది. 

ఈ ఏరియాలో అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ స‌హా చాలా మంది అగ్ర క‌థానాయ‌కులు, క‌థానాయిక‌ల‌కు ఆస్తులు ఉన్నాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. క్రిష్ ఫ్రాంఛైజీలో మూడు చిత్రాల‌కు రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఇప్పుడు నాలుగో భాగానికి హృతిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాకేష్ రోష‌న్ ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Hrithik and his father Rakesh Roshan have sold three residential properties for a total of 6.75 cr in Mumbai

Hrithik and Rakesh Roshan sell 3 Andheri West properties
hrithik