Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mystery Surrounds Balakrishna Son Mokshagna Debut

బాలయ్యా.. మోక్షు ఎంట్రీ ఎప్పుడయ్యా..

 

గత ఏడాది సెప్టెంబర్ లోనే హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన నందమూరి వారసుడు మోక్షజ్ఞ.. ఇప్పటివరకు ఐపు అజా లేకుండా పోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ అనౌన్సమెంట్ దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత మోక్షజ్ఞ గురించి ఏ వార్త వినిపించలేదు. ప్రశాంతవర్మ తో మూవీ అన్నాక మోక్షజ్ఞ హీరో ట్రాన్స్ఫర్మేషన్ కి నందమూరి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం షాకయ్యారు. 

ఆ ఫోటో షూట్స్ తర్వాత మోక్షజ్ఞ పబ్లిక్ ఫంక్షన్ లో కానీ, ఇంకే ఇతర ఈవెంట్స్ లో కానీ కనిపించలేదు. ఆఖరికి నందమూరి అభిమానులు ఈ ఏడాది బాలయ్య బర్త్ డే కైనా మోక్షజ్ఞ కొత్త సినిమా వివరాలు అందుతాయని ఆశపడ్డారు. కానీ బాలకృష్ణ బర్త్ డే వచ్చింది, వెళ్ళింది మోక్షజ్ఞ ఊసు మాత్రం లేదు. 

దానితో నందమూరి అభిమానులు ప్రస్టేట్ అవుతున్నారు, అయ్యా బాలయ్య.. మోక్షజ్ఞ సినిమా గురించి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొండయ్యా, ముందు మోక్షు ఎంట్రీ పై ఎనౌన్సమెంట్ చెయ్యండి బాబు అంటూ రిక్వెస్ట్ లు పెడుతూ బాలయ్యను బ్రతిమాలుకుంటున్నారు. చూద్దాం బాలయ్య ఆలోచన ఎలా ఉందొ అనేది. 

Prashanth Varma is not going to direct the debut film of Mokshagna

Mystery Surrounds Balakrishna Son Mokshagna Debut
mokshagna