హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ అదేనా
New Release Date for HHVMపవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరమల్లు వాయిదాల పర్వంతో పవన్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోతున్నారు. పదే పదే వాయిదా పడడం వారికి చిరాకు తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ మే మొదటివారంలోనే షూటింగ్ కంప్లీట్ చెయ్యడంతో జూన్ 12 న సినిమా రిలీజ్ అని మేకర్స్ హడావిడి పడ్డారు. కానీ అనుకున్న తేదికి వీరమల్లుని రిలీజ్ చేయలేకపోయారు.
ఆతర్వాత హరి హర వీరమల్లు క్లైమాక్స్ కి సంబందించిన విజువల్ ఎఫక్ట్స్ పై వార్తలు చక్కర్లు కొట్టాయి, అలాగే పలు రకాల విడుదల తేదీలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ పై మరో తేదీ ప్రచారంలోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 18 వీరమల్లు రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా టాక్.
కన్నప్ప, కింగ్ డమ్, అనుష్క ఘాటీ ఇలా ఎవ్వరిని డిస్ట్రబ్ చెయ్యకుండా వీరమల్లు మేకర్స్ జులై 18 స్లాట్ ను ఎంచుకున్నారని అంటున్నారు. చూద్దాం మేకర్స్ ఆలోచన ఎలా ఉందొ అనేది.
Hari Hara Veera Mallu To Release On July 18







































