దీపిక ను సపోర్ట్ చేస్తున్న దర్శకుడు

Kabir Khan supports Deepika PadukoneKabir Khan supports Deepika Padukone

కొద్దిరోజులక్రితం దీపిక పదుకొనె వర్కింగ్ స్టయిల్ నచ్చక ఆమెను స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సందీప్ వంగ తీసేసినట్లుగా ప్రచారం జరగడం, తర్వాత తన కథ లీక్ చేసింది అంటూ దీపిక పీఆర్ టీమ్ పై సందీప్ ఫైర్ అవడం, ఈ విషయంలో దీపిక పదుకొనె క్లారిటీ ఇస్తూ నేను పారితోషికం అడిగాను, వారికీ నచ్చలేదు, నేను చెయ్యను అని చెప్పాను అని చెప్పింది. 

అంతేకాకుండా దీపిక పదుకొనె సినిమా సెట్ లో ఇన్ని గంటలే పని చేస్తాను, ఇన్ని కాల్షీట్స్ ఇస్తాను అంటే సందీప్ వంగ కి దీపిక పెట్టిన కండిషన్స్ నచ్చక ఆమెను ఈప్రాజెక్టు నుంచి తప్పించిన విషయం పెద్ద సన్సేషన్ అయ్యింది. తాజాగా దీపిక పారితోషికం డిమాండ్ చెయ్యడం తప్పుకాదు, అలాగే ఆమె పనిగంటలు విషయంలో కండిషన్ పెట్టడం అసలుకే తప్పు లేదు అంటూ బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు దీపిక ను వెనకేసుకురావడం హాట్ టాపిక్ అయ్యింది. 

డైరెక్టర్ కబీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. నేను చాలామంది సిబ్బందితో కలిసి పనిచేస్తుంటాను. సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా సొంత లైఫ్ ఉంటుంది, అలాగే హెల్త్ ముఖ్యం, స్టార్ హీరోలైన ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్‌లో మాత్రమే పనిచేస్తారు. అదే దీపిక విషయంలో ఎందుకు తప్పవుతుంది. 

సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే వాదనను నేను అంగీకరించను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. ఇక పారితోషికం విషయానికొస్తే పాపులర్ హీరోయిన్ ఎవ్వరైనా తమ క్రేజ్ ని బట్టి పారితోషికం ఆశించడం తప్పు లేదు అంటూ కబీర్ ఖాన్ దీపిక్ పదుకొనె ను సపోర్ట్ మట్లాడడం వైరల్ అయ్యింది. 

Aamir Khan, Akshay Kumar work on an 8-hour shift too, says Kabir Khan

kabir khan