ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Raja Saab teaser leak: Makers Warn

రాజా సాబ్ టీజర్ లీక్ పై మేకర్స్ వార్నింగ్

మరో మూడు రోజుల్లో రాబోయే ప్రభాస్ రాజా సాబ్ టీజర్ పై ఎంత హైప్ ఉందొ, ఎంతగా ఎదురు చూపులు ఉన్నాయో అనేది సోషల్ మీడియాలో గత నాలుగు నెలలుగా చూస్తున్నాము, దర్శకుడు మారుతి రాజా సాబ్ టీజర్ తో సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేలా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. 

ఈలోగా రాజా సాబ్ టీజర్ లీక్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసింది. టీజర్ కి సంబందించిన విజువల్ వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. రాజా సాబ్ మేకర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. రాజా సాబ్ మేకర్స్ వెంటనే అలెర్ట్ అయ్యి.. టీజర్ కి సంబందించిన ఏ లీక్ ని షేర్ చేసినా ఊరుకోము అంటూ హెచ్చరిస్తుంది. 

రాజా సాబ్ టీజర్ కు సంబందించిన అనధికారిక వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ లీక్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్యాన్ చేసేలా చేస్తామని, రాజా సాబ్ కంటెంట్ ను ఎవరు లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అంటూ రాజా సాబ్ మేకర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి మూడు రోజుల్లో వచ్చే టీజర్ ని లీక్ చేసి పైశాచికానందం పొందడం ఎందుకు, టీజర్ వచ్చాక ఒరిజినల్ గా ఫ్రెష్ గా వీక్షించే దానికి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. 

Makers warn of strict action after The Raja Saab teaser leak

The Raja Saab teaser leak: Makers Warn
the raja saab