జబర్దస్త్ రష్మీ కో యాంకర్ వచ్చేసాడు

జబర్దస్త్ రీ లోడెడ్ వెర్షన్ అంటూ కామెడీగా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించిన యాజమాన్యం.. జబర్దస్థ్ లో అన్ని డబుల్ అంటూ చెప్పినట్టుగానే యాంకర్ రష్మీ కి కో యాంకర్ ని తెచ్చి పక్కనపెట్టింది. అయితే రష్మీ పక్కన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి రెండో యాంకర్ గా మేల్ యాంకర్ గా రాబోతున్నారు అని చాలామంది అనుకున్నారు.
కొత్త ప్రోమోలో సుడిగాలి సుధీర్ మాదిరిగా బిల్డప్ ఇచ్చిన ఆ కొత్త మేల్ యాంకర్ ఎవరో తేలిపోయింది. అతనెవరో కాదు బుల్లితెర శోభన్ బాబు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్. అవును మానస్ జబర్దస్త్ కి కొత్త మేల్ యాంకర్ గా రాబోతున్నట్టుగా రివీల్ చేసారు. ఈ రోజు ఎపిసోడ్ లోనే మానస్ ఎంట్రీ ఉండబోతుంది.
మరి రష్మీ గౌతమ్ తో కలిసి మానస్ జబర్దస్త్ స్టేజ్ పై చేసే కామెడీ, సందడి జబర్డస్త్ కి ఎంత ఊపొస్తుందో, ఈ జబర్దస్త్ రీ లోడెడ్ వెర్షన్ ఎంతగా బుల్లితెర ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుందో చూడాలి. అసలే జబర్దస్త్ ఈమధ్యన కళ కోల్పోయి ఢీలా పడింది.
Brahmamudi Maanas As Jabardasth New Chapter Begins Anchor
Jabardasth New Chapter Begins Anchor With Rashmi Gautam






































