ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kantara: Chapter 1 artist Viju V.K. dies

కాంతార చాప్టర్ 1ని వెంటాడుతున్న అపశకునాలు

కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార 2 పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి దానికి ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్ 1 ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 2 టార్గెట్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటినుంచి అపశకునాలు వెంటాడుతున్నాయనెలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. 

కొద్ధి రోజుల క్రితం కాంతార కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రయాణం చేసున్న బస్సు తిరగబడింది, ఆ ఘటన లో కొంతమంది ఆర్టిస్ట్ లు గాయపడ్డారు. ఆతర్వాత కేరళ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆఘటన మరువకముందే ఇదే సినిమాలో నటిస్తోన్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్ను మూశాడు. 

తాజాగా కాంతార 1 లో నటిస్తోన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ అనుకోకుండా మరణించడం కలకలం సృష్టించింది. కేరళలోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలి మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. త్రిసూర్ లో నివాసముండే విజు వికే కాంతార: చాప్టర్ 1 షూటింగ్ కోసం కర్ణాటకకు రాగా.. ఆయన అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో బస చేశారు. బుధవారం రాత్రి ఆయనకు గుండె నొప్పి వచ్చింది. దానితో వెంటనే టీమ్ ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 

ఇలా కాంతార టీం లోని సభ్యులు ఒక్కొక్కరిగా అనుకోని సంఘటనలో మృతి చెందడం చూసిన వారు.. అసలు కాంతార విషయంలో ఏం జరుగుతుంది, ఈ అపశకునాలేమిటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు.   

Kantara: Chapter 1 artist Viju V.K. dies of a heart attack

Kantara: Chapter 1 artist Viju V.K. dies
kantara