బిగ్ బాస్ 9 ఇంత తొందరగానా

Bigg Boss Season 9 updateBigg Boss Season 9 update

తెలుగులో బిగ్ బాస్ సీజన్స్ పై క్రేజ్ తగ్గుతున్నా యజమాన్యం మాత్రం కొత్త సీజన్ ను కొత్తగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత కొన్ని సీజన్స్ విషయంలో సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటి నడిచిందో, విన్నర్స్ అయిన వారికి అంతే సపోర్ట్ కనిపించింది. అందుకే యాజమాన్యం కూడా ఉత్సాహంగా కొత్త సీజన్ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టేసింది. 

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నిర్మాణం మొదలు పెట్టింది. అయితే ఈసారి బిగ్ బాస్ సెప్టెంబర్ కాకుండా ఇంకాస్త ముందుగానే అంటే ఆగష్టు చివరి వారం నుంచే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. హౌస్ సెట్ ఓ కొలిక్కి వస్తే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు పెట్టేందుకు డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 

ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేవారి పేర్లు అప్పుడే వైరల్ అవుతున్నాయి. అందులో కల్పిక గణేష్, అలేఖ్య చిట్టి పికిల్స్ అలేఖ్య పేరు, ఇమ్మాన్యువల్, అలాగే సీరియల్ ఆర్టిస్ట్ తేజస్విని బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లే వారి పేర్లలో గట్టిగా వినబడుతున్న లిస్ట్. మరి ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారో అనేది సీజన్ మొదలయ్యే సమయానికి లీకైపోతాయి, సో ఈ సీజన్ కాస్త ఎర్లీ గా మొదలయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే దానికి సంబందించిన అగ్రిమెంట్ ని నాగార్జున పూర్తి చేశారు అని సమాచారం. 

Nag to Turn Busy as Host for Bigg Boss Season 9

bigg boss