పబ్బు లో గబ్బు-కల్పికపై కేసు నమోదు
Case filed against actress Kalpika Ganeshఈమధ్యన పబ్బులో గబ్బు చేసిన నటి కల్పిక గణేష్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా అక్కడి పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించి మీడియాకెక్కిన కల్పిక గణేష్ పై పబ్ యాజమాన్యం కేసు పెట్టింది.
పబ్ లో తాగేసి రచ్చ చేస్తూ.. కేక్ అడిగితె ఇవ్వలేదు అంటూ ప్లేట్స్ విసిరేయడం, పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, సిబ్బందిని బూతులు తిట్టడంపై ప్రిజం పబ్ యాజమాన్యం కల్పిక పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే కల్పిక గణేష్ హంగామా సృష్టించింది అంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేసారు. పోలీసులు! 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కల్పిక పై కేసులు నమోదు చేసారు. పబ్ లో రచ్చ తర్వాత ఆమె తన తప్పు లేదు అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Case filed against Kalpika Ganesh over Prism Pub row






































