Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> SRK Wife Gauri Controversy Turns Golden Chance

రెస్టారెంట్‌పై ఆరోప‌ణ.. స్టార్ వైఫ్ త‌డాఖా

SRK Wife Gauri Controversy Turns Golden Chance

ఫ‌లానా స్టార్ వైఫ్ రెస్టారెంట్ లో తిండి ప‌దార్థాలు న‌కిలీవి అని ప్ర‌చారం జ‌రిగితే, దానితో క‌లిగే డ్యామేజీ వేరే లెవ‌ల్లో ఉంటుంది. ఆద‌ర్శ‌వంతంగా ఉండాల్సిన ఫుడ్ బిజినెస్ లో ఏ చిన్న తేడా కొట్టినా, ఆ వ్యాపారం మున‌క‌లేసిన‌ట్టే. స‌రిగ్గా నెల‌రోజుల క్రితం ముంబై లోని ఖ‌రీదైన ఏరియాలో ర‌న్ అవుతున్న గౌరీ ఖాన్ `టోరి` రెస్టారెంట్ లో న‌కిలీ ప‌నీర్ ని క‌స్ట‌మ‌ర్ కి అందిస్తున్నార‌ని ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ సార్థ‌క్ క‌థ‌నం ప్ర‌చురించారు. స్టార్చ్ టెస్ట్ లో తేడా కూడా తెలిసిపోయింది.

ఈ క‌థ‌నం జెట్ స్పీడ్ తో ఇన్ స్టా అభిమానుల్లో దూసుకుపోయింది. ఒక సూప‌ర్ స్టార్ భార్య ర‌న్ చేస్తున్న హోట‌ల్ లో అన్నీ నాశిర‌కాలు తినిపిస్తున్నార‌నే అప‌ప్ర‌ద ఎదురైంది. ఇంత‌లోనే రెస్టారెంట్ స్టాఫ్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు  చేప‌ట్టారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం వెంట‌నే ఒక ప్ర‌క‌ట‌న‌ను వైర‌ల్  చేసారు. `టోరి` రెస్టారెంట్‌లో అధిక నాణ్య‌త విష‌యంలో రాజీకి వ‌చ్చేదే లేద‌ని హెడ్ చెఫ్ స్టీఫెన్ ప్ర‌క‌టించారు. సందేహాలుంటే నివృత్తి చేస్తామ‌ని, త‌మ‌ను సంప్ర‌దించాల‌ని కోరారు. సోయా తో త‌యారు చేసిన ఐట‌మ్ విష‌యంలో స్టార్చ్ టెస్ట్ చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దని యూట్యూబ‌ర్ కి తెలీదు.. అయితే యూట్యూబ‌ర్ ఆ హోట‌ల్‌లో నకిలీ ప‌నీర్ అమ్ముతున్నార‌ని నిరూపించ‌లేదు. దీంతో వార్త వైర‌ల్ అయినా కానీ, దానిని ఎవ‌రూ న‌మ్మలేదు.

ఇప్పుడు `టోరి`కి ఇన్ స్టాలో బోలెడంత ఫాలోయింగ్ పెరిగింద‌ని హెడ్ చెఫ్ చెబుతున్నాడు. మొత్తానికి గౌరీ ఖాన్ కి గండం గడిచింది. ఆ రెస్టారెంట్ ద్వారా లాభ న‌ష్టాల మాట ఎలా ఉన్నా త‌న‌కు మాత్రం చెడ్డ పేరు మిగిలేది. ఈ ఎపిసోడ్ లో హోట‌ల్ సిబ్బంది త‌మ‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే ఖండించ‌డ‌మే విజ‌యానికి తొలి మెట్టుగా మారింది. 

Gauri Khan Restaurant Torii Head Chef Reveals Fake Paneer Controversy Was Blessing In Disguise

gauri khan