Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trivikram To Make His Dream Project With NTR

ఎన్టీఆర్ లైనప్ లోకి క్రేజీ డైరెక్టర్

Trivikram To Make His Dream Project With NTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నారు. దాని తర్వాత ఆయన కొరటాల దర్శకత్వంలో దేవర 2 కంప్లీట్ చెయ్యాల్సి ఉంది, ఈలోపే నిర్మాత నాగవంశీ తో మరో మూవీ ని ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో అనౌన్స్ చేసారు. 

తాజాగా ఎన్టీఆర్ లైనప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ ఎంటర్ కాబోతున్నారని వార్త చక్కర్లు కొడుతోంది. ఆయనే ఎన్టీఆర్ గతంలో చేసిన అరవింద సమెత దర్శకుడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో మూవీ అనౌన్సమెంట్ తోనే ఆగిపోయిన త్రివిక్రమ్ ప్రస్తుతం ఏ హీరోతో సినిమా ప్రకటిస్తారా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా వెంకటేష్ తో త్రివిక్రం మూవీ ఉంటుంది అనే ప్రచారం జోరుగా జరిగింది. 

కానీ అల్లు అర్జున్ తో అనుకున్న ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోతున్నారంటూ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. నిర్మాత నాగవంశీ ఒకవేళ త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ సెట్ చేసినా.. మరోపక్క ఎన్టీఆర్ లైనప్ అద్దిరిపోతున్నా.. అసలు త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కేనా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనేది ఎన్టీఆర్ అభిమానుల ముందున్న అతిపెద్ద డౌట్. 

NTR – Trivikram Combo Back on Cards

ntr