మంగ్లీ బర్త్ డే పార్టీ లో విదేశీ మద్యం
Ganja and Foreign Liquor At Singer Mangli Birthday Bashసింగర్ మంగ్లీ పుట్టి రోజు జూన్ 10. ఈసారి తన బర్త్ డే ని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ నడుమ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది మంగ్లీ. కాకపోతే ఆ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ ఏరులై పారినట్టుగా ఎస్ఓటీ పోలీసులు కనిపెట్టారు. జూన్ 10 మంగళవారం మంగ్లీ చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో బర్త్ డే పార్టీ ఇచ్చింది.
మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ మొత్తంగా మంగ్లీ బర్త్ డే పార్టీకి 48 మంది వరకు హాజరు అయ్యారని తెలుస్తోంది. పక్కా ఇన్ఫర్మేషన్ తో ఆ రిసార్టు పై అర్థరాత్రి రెండు గంటల తరువాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
రిసార్టులో జరిగిన ఆ బర్త్ డే పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.. అంతేకాదు బర్త్ డే పార్టీకి హాజరైన వారికి పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ గా తేలడం హాట్ టాపిక్ గా మారింది.
Police Seize Foreign Liquor and Marijuana at Singer Mangli Birthday Bash







































