రెండేళ్ల వయసుకే 250కోట్ల ఆస్తి
Raha Becomes Owner of Rs 250 Cr Property at Age 2ఈ స్టార్ కిడ్ కేవలం రెండేళ్ల వయసుకే 250కోట్ల ఆస్తిపరురాలు అయింది. ముంబైలోని విలాసవంతమైన ఏరియాలో ఒక సొంత భవనాన్ని కలిగి ఉంది. అమితాబ్, సల్మాన్, షారూఖ్ సహా ఎందరో సినీదిగ్గజాలు నివాసం ఉండే చోట తనకు తల్లిదండ్రులు అధునాతన సౌకర్యాలు ఉన్న ఖరీదైన భవంతిని కానుకగా రాసిస్తున్నారు. ఇలాంటి అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. ఇదంతా ఎవరి గురించి అంటే? రణబీర్ కపూర్- ఆలియా భట్ దంపతుల కుమార్తె రాహా కపూర్ గురించి. రాహా ఇప్పుడు రెండేళ్ల కిడ్. చిన్నారి జన్మించగానే కపూర్ కుటుంబం నుంచి వచ్చిన తొలి అతిపెద్ద ప్రకటన, కపూర్ వంశపు విలాసాల రాజ భవంతిని తనకు కానుకగా ఇచ్చేస్తున్నామని.
నిజానికి రాహా రాక రణబీర్ కపూర్- ఆలియా జంట జీవితంలోకి సిసలైన అదృష్టాన్ని తెచ్చింది. రణబీర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కెరీర్ పరంగా అజేయంగా దూసుకెళుతున్నాడు. అలాగే ఇప్పుడు ఒక కొత్త భవంతిని నిర్మించి దానిలోకి రణబీర్- ఆలియా ప్రవేశిస్తున్నారు.. అన్నీ శుభశకునములే. అంటే అది బిడ్డొచ్చే వేళ కలిసొచ్చిన విషయం.
ఏది ఏమైనా త్వరలో గృహప్రవేశం చేయబోతున్న బాంద్రా కొత్త ఇంటిని రెండేళ్ల చిన్నారి రాహాకు రాసిచ్చేందుకు కపూర్ దంపతులు సిద్ధంగా ఉన్నారు. రాజ్ కపూర్- కృష్ణా రాజ్ కపూర్ వారసత్వ సంపద తర్వాత రిషీ కపూర్ కి దక్కగా, దానిని రిషీజీ రణబీర్ కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆ ఆస్తిని రాహాకు కానుకగా రాసిచ్చేస్తున్నారు. నిజంగా రాహా లక్కీ కిడ్.
Ranbir Kapoor and Alia Rs 250 crore Krishna Raj bungalow, dedicated to daughter Raha







































