Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Plans Are On To Release Thug Life On OTT Much Earlier

ముందుగానే ఓటీటీలోకి థగ్ లైఫ్

Plans Are On To Release Thug Life On OTT Much Earlier

కమల్ హాసన్ లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్ ఎన్నో అంచనాల నడుమ జూన్ 5 న థియేటర్స్ లో విడుదలైంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు, మరెన్నో హోప్స్ కలిగేలా కమల్ అండ్ టీమ్ కష్టపడింది. కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి ఇలా ప్రతి ఒక్కరూ థగ్ లైఫ్ ప్రమోషన్స్ కోసం కష్టపడ్డారు. 

జూన్ 5 లో  థియేటర్స్ లో దిగిన థగ్ లైఫ్ లైఫ్ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. మణిరత్నం దర్శకత్వం అవుట్ డేటెడ్, ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్ నిరాశపరిచాయి, త్రిష-కమల్ ట్రాక్ పై విమర్శలు, శింబు కేరెక్టర్ అతని పెరఫార్మెన్స్ బావున్నా.. థగ్ లైఫ్ రిజల్ట్ ఆ కేరెక్టర్ ని తొక్కేసింది. 

థగ్ లైఫ్ థియేటర్స్ లో అన్ని విధాలుగా డిజప్పాయింట్ చేసింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన థగ్ లైఫ్ ని అనుకున్న సమయం కన్నా ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

ఎనిమిది వారాల డీల్ ని నెట్ ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసుకుని ముందుగా స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఆ డేట్ ఎప్పుడు అనేది.!

Thug Life: Netflix cancels 8-week OTT deal

thug life