ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bollywood heroes chasing South directors

సౌత్ వెంట పడుతున్న బాలీవుడ్ హీరోలు

బాలీవుడ్ హీరోలకు బిగ్ హిట్ కావాలి. హిందీ పరిశ్రమ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కోసం తహతహలాడుతోంది. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే హిట్ ని చూస్తున్న హిందీ పరిశ్రమకు ఇమ్మిడియట్ గా సక్సెస్ కావాలి. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు సౌత్ దర్శకులు వెంట పడుతున్నారు. ఇప్పటికే సందీప్ వంగ కబీర్ సింగ్ ని షాహిద్ కపూర్ తో, రణబీర్ తో యానిమల్ చేసారు. రెండు చిత్రాలు బిగ్ హిట్స్. 

ఆ తర్వాత కోలీవుడ్ దర్శకుడు షారుఖ్ ఖాన్ తో జవాన్ తీసి హిట్ కొట్టాడు. కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ ని నమ్మి సల్మాన్ రంగంలోకి దిగారు, కానీ సికందర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో జాట్ చేసారు. అది బిగ్ హిట్ అయ్యింది. అలా హిందీ హీరోలు సౌత్ దర్శకుల వెంట పడుతున్నారు. అక్కడి దర్శకులని నమ్మితే సినిమాలు ఆడడం లేదు. 

సౌత్ దర్శకులు మాత్రం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దున్నేస్తున్నారు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చద్దా తర్వాత నటనకు లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమిర్ ఖాన్ కూడా సక్సెస్ కోసం కోలీవుడ్ దర్శకుడితో చేతులు కలుపుతున్నారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఆమిర్ ఖాన్ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది. అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది పక్కనపెడితే.. ఆమిర్ కూడా ఆఖరికి సౌత్ దర్శకుడుని వెతకడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇలా బాలీవుడ్ హీరోలు చాలామంది హిందీ మేకర్స్ ని పక్కనపెట్టి ఇలా సౌత్ డైరెక్టర్స్ ని చూజ్ చేసుకోవడం చూస్తే సక్సెస్ కోసం వారెంత పరితపిస్తున్నారో అర్ధమవుతుంది. 

Bollywood Stars Falling for South Directors

Bollywood heroes chasing South directors
bollywood