అఖిల్-జైనాబ్ రిసెప్షన్ లో సూపర్ స్టార్ మహేష్
Superstar Mahesh at Akhil-Zainab wedding receptionసూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో సినిమా స్టార్ట్ చేసాక ఎప్పుడు బయట కనిపించినా ఆయన అభిమానులకు పండగే, SSMB 29 అప్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తున్న మహేష్ అభిమానులకు ఆయన బయట కనిపించినా చాలు అనేలా ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ అఖిల్ - జైనాబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ లో కనిపించారు.
జూన్ 6 న అఖిల్-జైనాబ్ ల వివాహాన్ని అక్కినేని నాగార్జున తన ఇంట్లోనే కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ జరిపించినప్పటికీ.. జూన్ 8 ఆదివారం అఖిల్-జైనాబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిపిస్తున్నారు. ఈ రిసెప్షన్ లో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంతులు పాల్గొనబోతున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఆయన భార్య నమ్రత, మహేష్ కుమార్తె సితార లు అఖిల్-జైనాబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేసిన ఫొటోస్ అక్కినేని నాగార్జున పీఆర్ టీమ్ రివీల్ చేసింది. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ ఒక్క పెళ్ళి ఫోటో కూడా బయటికి రాకుండా.. పెళ్లి, రిసెప్షన్ విషయాలేవీ లీకవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అఖిల్ పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు కూడా ఆచి తూచి వదులుతున్నారు.
Celebrities at Akhil and Zainab wedding reception







































