Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Abhishek Banerjee Highlights Pay Gap Issues in Film Industry

డ‌బ్బు వెంట ప‌డి నాశ‌న‌మైన సినీప‌రిశ్ర‌మ‌

బాలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలు డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్న త‌ర్వాత ఇప్పుడు ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌డ‌మే గాక‌, విమర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఈ సినిమా టైటిల్ - స్టోలెన్. క‌ర‌ణ్ తేజ్ పాల్ అనే డెబ్యూ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. స్టోలెన్ విడుదలైనప్పటి నుండి హిందీ చిత్ర పరిశ్రమలోని విమర్శకులు, ద‌ర్శ‌క‌నిర్మాతల ప్రశంసలను అందుకుంది. ఇటీవల స్టోలెన్ నిర్మాత‌లు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, నిఖిల్ అద్వానీ వంటి దిగ్గ‌జాలు సీనియ‌ర్ ఫిలింమేక‌ర్ అభిషేక్‌తో కలిసి ఈ చిత్రం గురించి మాట్లాడటానికి, అలాగే  హిందీ చిత్రసీమ‌ ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడ‌టానికి ఓచోట స‌మావేశ‌మ‌య్యారు. నిజానికి ఈ రోజుల్లో పెద్ద నటులు చిన్న సినిమాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. బాక్సాఫీస్ నంబ‌ర్స్ మాత్ర‌మే చూస్తున్నారని విశ్లేషించారు.

 

చర్చా స‌మావేశంలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు, కళాత్మక సినిమాల మధ్య సమతుల్యతను సాధించాలనే అమీర్ ఖాన్ మంత్రాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమిర్ ఖాన్ తాను నిర్మించాలనుకునే సినిమాలు తీయడానికి క‌మర్షియ‌ల్ సినిమాలు చేస్తానని చెప్పడం విన్నాను. మ‌నం క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ప‌ని చేస్తే, క‌ళాత్మ‌క సినిమాలో కూడా భాగం కావచ్చని ప్రజల నుండి విన్నాను`` అని ఆయన అన్నారు. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలలో న‌టిస్తూనే, అదే సమయంలో తన సృజనాత్మక ఆత్మ‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి చిన్న, స్వతంత్రత ఉన్న ఫిలింమేక‌ర్స్ ప్రాజెక్టులను ఎంపిక చేసుకునేవార‌ని అనురాగ్ అన్నారు. ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కురాలు కిర‌ణ్ రావు మాట్లాడుతూ..  తన మాజీ భర్తను ప్రశంసిస్తూ, ఆమీర్ తన కెరీర్‌లో చాలా మంది డెబ్యూ ఫిలింమేక‌ర్స్ తో ప‌నిచేశార‌ని, కథాంశంఎగ్జ‌యిట్ చేస్తే రిస్కులు చేసార‌ని గుర్తు చేసారు. చాలా మంది స్టార్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు అని అన్నారు.

 

ఓంకార, హైదర్ వంటి సినిమాలను ఉదాహరణగా అనురాగ్ ఉదహరించారు. అజయ్ దేవగన్, షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటి పెద్ద స్టార్లు చిన్న సినిమాలతో నిరూపించారు. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ వంటి వారు ఓంకార లాంటి సినిమాలు చేయడానికి కారణమేమిటి? షాహిద్ కపూర్ హైదర్ చేయడానికి కారణమేమిటి? అనేది విశ్లేషించాల‌ని అన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, మార్కెటింగ్‌లో ఒక భావన క్రియేటైంది. ఇప్పుడు అందరూ ఒకరిని మించి ఒక‌రు పెద్ద హిట్‌లు అందించడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి ఎవరూ ఇప్పుడు స్క్రిప్ట్‌ను నిజంగా చూడటం లేదు. అది హిట్ అవుతుందో లేదో వారు చూస్తున్నారు... అని విశ్లేషించారు. 

film industry running behind money says Abhishek Banerjee

Abhishek Banerjee Highlights Pay Gap Issues in Film Industry
abhishek banerjee