ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Palak Tiwari Not a conventional star kid

న‌న్ను స్టార్ కిడ్‌లా చూడ‌టం లేదు

Palak Tiwari Not a conventional star kidPalak Tiwari Not a conventional star kid

బుల్లితెర నటి శ్వేతా తివారీ కుమార్తెగా పాల‌క్ తివారీ సుప‌రిచితురాలు. ఈ భామ త‌న కెరీర్ డైల‌మా గురించి తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. పాలక్ తివారీ ఒక స్టార్ కిడ్, కానీ త‌న‌ తల్లి టీవీ ఇండ‌స్ట్రీలో బలమైన నేపథ్యం ఉండటంతో, త‌న‌ను హిందీ చిత్ర పరిశ్రమలో మరే ఇతర స్టార్ కిడ్‌గా చూడలేదని చెబుతోంది.

 

``నేను ఈ మధ్యలో ఎక్కడో ఉన్నాను. ఇక్క‌డ వ్య‌క్తులు నన్ను స్టార్ కిడ్ అని పిలుస్తున్నారు.. కానీ నేను నిజంగా స్టార్ కిడ్ కాదు. అలాగ‌ని నేను ముంబై, అంధేరీలో ఆడిషన్ కి వెళుతున్న సాధారణ వ్యక్తిని కాదు. కాబట్టి నాకు ఏదో ఒక‌ ప్రత్యేకత ఉంది కానీ అది ఇండ‌స్ట్రీలో స‌రిపోవ‌డంలేదు. సాధారణ స్థితి కూడా ఉంది.. కానీ అదీ సరిపోలేదు. నా స్థానాన్ని కనుక్కోవ‌డం చాలా కష్టంగా ఉంది`` అని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. నేను ఇలా ఉండ‌టం ఒక ప్రత్యేకత, కానీ న‌న్ను ఫ‌లానా అంటూ టైప్‌కాస్ట్ చేస్తుండ‌టంతో దానితో ఇబ్బంది పడ్డాను. ఇప్పటికీ నా స్థానం ఏమిటో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను``అని చెప్పింది.

 

శ్వేతా తివారీ పెద్ద తెర‌పై నటించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అని ప్ర‌శ్నించ‌గా, నా తల్లికి పెద్ద తెరపైకి రావడానికి చాలా అవకాశాలు వచ్చాయి, కానీ ఆమె టెలివిజన్‌తో చాలా సంతృప్తి చెందింది. బుల్లితెర‌ ఆమెకు, మాకు చాలా ఇచ్చింది. మాకు సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి. నా జీవితం సౌకర్యవంతంగా ఉంది. నా సోదరుడు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపాడు.. అన్నీ టెలివిజన్ వల్లనే, కాబట్టి నేను ఎల్లప్పుడూ టెలివిజన్‌ను గౌరవిస్తాను . నా అమ్మ అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఆమె ఎప్పుడూ ఆ కోణంలో దురాశ చెందలేదు! అని పాల‌క్ చెప్పింది. న‌ట‌వార‌సురాలి మెచ్యూరిటీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Palak Tiwari on not being a typical star kid

palak tiwari