Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Young hero Pan Indian dream Turns Costly

యువ‌హీరో నేల‌విడిచి సాము

హీరో అవ్వ‌డం వెయ్యి జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం.. అది స‌రే కానీ, నిర్మాత‌ల జేబులు ఊస్టింగ్ చేసే ఈ ప‌థకాలే మ‌రీ ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ సాగుతోంది. ఈ టాలీవుడ్ యంగ్ హీరో కెరీర్ ఆరంభం కొన్ని హిట్లు కొట్టి మిడ్ రేంజుకు ఎదిగాడు. కానీ ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది. అలాంటి స‌మ‌యంలోనే ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో హిట్టు కొట్టాడు. కానీ ఆ క్రెడిట్ హీరోకి కాకుండా ద‌ర్శ‌కుడికి, ఎంపిక చేసుకున్న కాన్సెప్టుకు వెళ్లిపోయింది.

 

ఇదిలా ఉండ‌గానే, ఈ యంగ్ హీరో పాన్ ఇండియా మూవీలోకి జంప్ చేసాడు. ఒక కొత్త డైరెక్ట‌ర్, ల‌క్కీ నిర్మాత‌తో క‌లిసి ప్ర‌యోగం మొద‌లెట్టాడు. అయితే ఈ ప్ర‌యోగం ఎప్ప‌టికి ప్ర‌యోగ‌శాల నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది? ఎప్ప‌టికి స‌క్సెస‌వుతుంది? అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళం త‌లెత్తింద‌నేది ఇన్ సైడ్ టాక్.

 

కేవ‌లం 60 కోట్ల రేంజులో సినిమాని పూర్తి చేయాల్సి ఉండ‌గా, ఇప్పుడు ఏకంగా 120 కోట్లు పైగా బ‌డ్జెట్ రేంజ్ పెరిగింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అంటే త‌న మార్కెట్ ని మించి మూడు రెట్లు అధికంగా నిర్మాత ఖ‌ర్చు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని బ‌య‌ట‌ప‌డేసేందుకు నిర్మాతపై ఆర్థిక భారం అధికంగా ప‌డుతోంద‌ని కూడా తెలుస్తోంది. ఫైనాన్సులు తెచ్చి సినిమా తీయ‌డం అంటే వీజీనా?  చివ‌రికి బిజినెస్ పూర్తి చేసి అప్పులు తీర్చేవ‌ర‌కూ టెన్ష‌న్ ఎదుర్కోవాలి.

 

పాన్ ఇండియాలో స‌త్తా చాటగ‌ల‌మ‌నే పంతంతోనే ఈ య‌వ‌హీరో, ఆ నిర్మాత డెబ్యూ ద‌ర్శ‌కుడితో భారీ ప్ర‌యోగం చేస్తున్నాడు. కానీ మార్కెట్ అంత‌గా లేని, థియేట‌ర్ల రంగం ఇబ్బందుల్లో ఉన్న ఈ కాలంలో అత‌డి సాహ‌సం ఎంత‌వ‌ర‌కూ ముందుకు సాగుతుందో చూడాలి! అంటూ సెటైర్లు ప‌డుతున్నాయి. ప‌రిస్థితిని గ‌మ‌నించి యువ‌హీరో జాగ్ర‌త్త ప‌డ‌తాడేమో చూడాలి.

Young hero Pan Indian film exceeds budget

Young hero Pan Indian dream Turns Costly
young hero pan indian film