Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nora Fatehi fell in love with Pop Singer

నోరాతో ప్రేమ‌లో పాప్ గాయ‌కుడు

డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫ‌తేహి ప్రేమ‌లో ప‌డిందా? అంటే అవున‌నే స‌మాచారం. ఈ భామ ప్ర‌ముఖ అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ తో ప్రేమ‌లో ప‌డింది. ఈ జంట ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో స‌న్నిహితంగా క‌నిపించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. అత‌డి పేరు బెన్సన్ బూన్. పాపుల‌ర్ గాయ‌కుడు. అమెరిక‌న్ మ్యూజిక్ అవార్డ్స్ లో ఈ జంట క‌లుసుకున్నారు. అప్ప‌టి నుంచి ఈ మొరాకో బ్యూటీ అత‌డితో ప్రేమ‌లో ఉంద‌ని తెలుస్తోంది.

 

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తాను ప్రేమించ‌డానికి మంచి యువ‌కుడు కావాలి అని నోరా ఫ‌తేహి వ్యాఖ్యానించింది. లోప‌లి నుంచి క్లీన్ గా ఉండే కుర్రాడు కావాలి. ఈ రంగుల ప్ర‌పంచంలో చాలామంది బాహ్యంగా అందంగా ఉంటారు. ఇలాంటి అవ‌కాశ వాదుల‌ను చూసాను. అబ‌ద్ధాలు చెప్పేవారు ఉన్నారు. మ‌న చుట్టూ ఉంటారు. మ‌న‌ల్ని, మ‌న మ‌నుషుల్ని వాడుకుంటారు. డ‌బ్బు కొట్టేస్తారు కానీ, నిజాయితీగా ఉండ‌రు! అని ఇండస్ట్రీ వ్య‌క్తుల‌పై అస‌హ్యం వ్య‌క్తం చేసింది. అయితే నోరా కోరుకున్న అన్ని ల‌క్ష‌ణాలు గాయ‌కుడు బెన్స‌న్ బూన్ లో ఉన్నాయేమో చూడాలి. నోరా- బెన్ష‌న్ జంట ప్రేమాయ‌ణంపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. నోరా బాహుబ‌లి మ‌నోహ‌రిగా సుప‌రిచితురాలు. ప్ర‌స్తుతం బాలీవుడ్ టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టిస్తోంది. రాఘ‌వ లారెన్స్ కాంచ‌న 4లోను న‌టిస్తూ బిజీగా ఉంది.  

Is He Nora Fatehi Boy friend

Nora Fatehi fell in love with Pop Singer
nora fatehi