కొడుకు పెళ్ళికి చంద్రబాబుకు నాగ్ ఆహ్వానం

కింగ్ నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి ఏర్పట్లను గ్రాండ్ గా స్టార్ట్ చెయ్యడమే కాదు, ఆయన సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను, అలాగే రాజకీయ నాయకులను, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లను పర్సనల్ గా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూన్ 6 న జరగపోయే అఖిల్-జైనబ్ ల వివాహానికి కొద్దిమంది బంధుమిత్రులను ఆహ్వానించినా, రిసెప్షన్ కోసం నాగార్జున ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
జూన్ 6 అఖిల్-జైనబ్ ల వివాహం జరగబోతుండగా.. జూన్ 8 న హైదరాబాద్ లో అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ ని నాగార్జున గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సతీ అంటే అమల సమేతంగా వెళ్లి అఖిల్ పెళ్లి ఆహ్వానపత్రిక అందించి వెడ్డింగ్ రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు.
ఈరోజు మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు ని కలిసి నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పెళ్ళికి రావల్సిందిగా ఆహ్వానించినా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నాగార్జున పర్సనల్ గా వెళ్లి సీఎం చంద్రబాబు కి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఇక ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యే అవకాశం ఉంది.
Nagarjuna Meets AP CM CHandrababu Naidu - Invites For Akhils Marriage
Nagarjuna met with AP CM Chandrababu






































