రిలీజ్ దగ్గరలో రిపేర్లేమిటి స్వామీ

మే 30 న విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన కింగ్ డమ్ చిత్రాన్ని విడుదల చేస్తామని నాగవంశీ ఎప్పుడో అనౌన్స్ చేసారు. కానీ కింగ్ డమ్ చిత్రం కొన్ని కారణాల వలన(హరి హర  వీరమల్లు కన్ఫ్యూజన్స్) జులై నెలలో విడుదల అని ప్రకటించారు. జులై 4 న కింగ్ డమ్ రిలీజ్ అవుతోంది.  

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు. ఇలాంటి సమయంలో కింగ్ డమ్ లోని కొన్ని సీన్స్ కి రిపేర్లు అంటూ వస్తున్న వార్తలతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళనపడుతున్నారు. సరిగ్గా సినిమా విడుదల నెల మాత్రమే ఉన్న సమయంలో ఇప్పుడు రిపేర్లు ఏమిటి స్వామి అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. 

రీసెంట్ గా ఫైనల్ కట్ చూసుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని భావించడంతో ఆ మేరకు వాటిని గోవాలో చిత్రీకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీని మీద వర్క్ జరుగుతోందట. ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఈ వార్త బయటికి లీకవడంతో విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 

ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన కింగ్ డమ్ మరోసారి వాయిదా వేసే ఆలోచన ఉండదు, కాబట్టి కింగ్ డమ్ టీమ్ ఉరుకులు పరుగులు మీద పనులు కంప్లీట్ చేస్తుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ కింగ్ డమ్ ని జులై 4 నే దించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట మేకర్స్.. సో విజయ్ అభిమానులు ఆందోళన పడక్కర్లేదు. 

Vijay Deverakonda Kingdom Goes For Reshoot Some Scenes

Kingdom Hits Reshoot Button
kingdom