ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Don't expect SSMB 29 update until then

అప్పటివరకు SSMB 29 అప్ డేట్ ఆశించకండి

Don't expect SSMB 29 update until then

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB 29 షూటింగ్ విషయాలేమి అధికారికంగా బయటికొచ్చిన పాపాన పోలేదు. సినిమా మొదలు పెట్టడమే సైలెంట్ గా సీక్రెట్ గా స్టార్ట్ చేసిన రాజమౌళి.. ఆతర్వాత మీడియా మీట్ పెడతారని ఆశించి భంగపడ్డారు మీడియా మిత్రులు, అభిమానులైతే SSMB 29 అప్ డేట్ కోసం అల్లాడిపోతున్నారు. 

కృష్ణగారి జయంతి రోజైనా మహేష్ మూవీ నుంచి అప్ డేట్ ఉంటుంది అని ఘట్టమనేని అభిమానులు ఆశించారు, కానీ కృష్ణగారి జయంతి వచ్చింది, వెళ్ళింది.. రాజమౌళి మాత్రం SSMB 29 పై ఏ చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అంటే మహేష్ చిత్రం నుంచి రాజమౌళి ఇచ్చే అప్ డేట్ ఇప్పట్లో ఉండదా అనే అనుమానం మహేష్ ఫ్యాన్స్ ని తొలిచేస్తోంది. 

ఆగష్టు 9 న ఖచ్చితంగా రాజమౌళి SSMB 29 విషయాలను రివీల్ చెయ్యడమో, లేదంటే మహేష్ లుక్ వదలడమే చేస్తారు.. ఒకవేళ మహేష్ SSMB 29 లుక్ వదిలి అప్పుడు ఆ చిత్ర విషయాలు రివీల్ చేసినా  చెయ్యొచ్చు, కానీ ఆగష్టు 9 మహేష్ బర్త్ డే వరకు రాజమౌళి-మహేష్ కాంబో అప్ డేట్ మాత్రం ఆశించకండి అనేది పై సారాంశం.  

పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి క్రేజీ నటులు భాగమైన SSMB 29 అప్ డేట్ కోసం మహేష్ అభిమానులే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది రాజమౌళి గారు కాస్త కనికరించండి అంటూ అంటూ మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. 

SSMB 29 Update

mahesh