పవన్ తో ప్రత్యేక ఇంటర్వూస్ అయ్యే పనేనా
Will there be a special interview with Pawanపవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు విడుదలకు ఎంతో సమయం లేదు, జూన్ 12 అంటే మరో పది రోజుల్లోనే వీరమల్లు పాన్ ఇండియా థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ ని పవన్ కళ్యాణ్ కంప్లీట్ చెయ్యడమే పెద్ద విషయం. అందుకే దర్శకనిర్మాతలు ఆయన్ని ప్రమోషన్స్ కి పిలిచే ధైర్యం కూడా చెయ్యడం లేదు.
ఈరోజు జూన్ 2 న వీరమల్లు ట్రైలర్ వస్తుంది అన్నారు, కానీ అప్ డేట్ లేదు. మరోపక్క తిరుపతిలో హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు. అయితే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లును ప్రమోట్ చేస్తారా అనే ధర్మ సందేహంలో పవన్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ కి వస్తారని, ఈ వీకెండ్ నుంచి పవన్ వీరమల్లు ప్రమోషన్స్ కోసం సమయం కేటాయిస్తారని తెలుస్తుంది. మీడియా ముందుకు కాకుండా పవన్ కళ్యాణ్ చేత ఇంటర్వూస్ ఇప్పించే ప్లాన్ మేకర్స్ చేస్తున్నారని, సెలబ్రిటీస్ అంటే ఏ త్రివిక్రమ్ చేతో పవన్ ని ఇంటర్వ్యూ చేయించి వదిలితే వీరమల్లు పై ఆటోమాటిక్ గా అంచనాలు వస్తాయని భావిస్తున్నారట.
అసలు పవన్ తో ప్రత్యేక ఇంటర్వూస్ అయ్యే పనేనా అని కొంతమంది మాట్లాడుతున్నారు, చూద్దాం వీరమల్లు కోసం పవన్ ఏం చేస్తారో అనేది.
Pawan Kalyan Promotional Strategy for Hari Hara Veera Mallu







































