నారా రోహిత్ వివాహానికి ముహూర్తం ఫిక్స్
Nara Rohit wedding date fixహీరో నారా రోహిత్ కొద్దిరోజులుగా సినిమాలకు, నటనకు బ్రేకిచ్చారు. గత ఏడాది ప్రతినిధి 2 కి ముందు కొన్నేళ్ళపాటు నారా రోహిత్ స్క్రీన్ పై కనిపించలేదు. దానితో రోహిత్ ఇకపై నటించరనే ప్రచారం జరిగిన వేళ నారా రోహిత్ ప్రతినిధి 2 తో ప్రేక్షకుల ముందు వచ్చారు. మళ్ళీ ఏడాదికి రోహిత్ భైరవం తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
గత ఏడాది ప్రతినిధి హీరోయిన్ సిరి (శిరీష) తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్న నారా రోహిత్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నారు. నారా రోహిత్ వయసు 40 ఏళ్ళు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, తన అభిప్రాయాలు, శిరీష అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి, అందుకే తమ ప్రయాణం మొదలైంది అని చెప్పిన నారా రోహిత్, శిరీష తో నిశ్చితార్ధం అవ్వగానే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించినా నారా రోహిత్ తండ్రి అకాల మరణంతో అతని పెళ్లి వాయిదా పడింది.
తాజాగా భైరవం ప్రమోషన్స్ లో నారా రోహిత్ తన పెళ్లి ఎప్పుడు జరగబోతుందో రివీల్ చేసారు. వచ్చే అక్టోబర్ లో శిరీష్ ని తను వివాహం చేసుకోబోతున్నట్టుగా నారా రోహిత్ ప్రకటించారు. అప్పటికి హిందూ సాంప్రదాయం అంటే తండ్రి చనిపోయి ఏడాది మాసికం పూర్తవుతుంది అని, ఆతర్వాతే అంటే ఆక్టోబర్ లో తన వివాహం ఉంటుంది అని నారా రోహిత్ భైరవం ప్రమోషన్స్ లో రివీల్ చేసారు.
Nara Rohit Ties The Knot with Sireesha Lella In October








































