Advertisement

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం కుదిరిందా

అక్కినేని ప్రిన్స్ అఖిల్ ప్రస్తుతం లెనిన్ షూటింగ్ తో పాటుగా తనకు కాబోయే భార్య జైనబ్ తో కలిసి అపుడప్పుడు సరదాగా వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ లోనే అఖిల్-జైనబ్ ల ఎంగేజ్మెంట్ ని అక్కినేని నాగార్జున హైదరాబాద్ లోని తన ఇంటిలోనే చాలా సింపుల్ గా నిర్వహించారు. అప్పటినుంచి అఖిల్ పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆతృతగా కనిపిస్తున్నారు. 

జైనబ్ ఫ్యామిలీ దుబాయ్ లో ఉంటుంది. బిజినెస్ ఫ్యామిలీ కావడంతో అఖిల్ వివాహం దుబాయ్ లో ఉంటుందా, లేదంటే హైదరాబాద్ లోనే నాగార్జున నిర్వహించనున్నారా అనే విషయంలో చాలామందిలో క్యూరియాసిటీ కనిపిస్తుంది. అయితే అఖిల్ పెళ్లి మార్చ్ లోనే  ఉంటుంది అని ప్రచారం జరిగినా అది అవ్వలేదు. ఆ తర్వాత తాజాగా అఖిల్ పెళ్లిపై కొత్త కబురు వినబడుతుంది. 

అఖిల్ -జైనబ్ ల వివాహం జూన్ 6 వ తేదీన జరగబోతున్నట్టుగా, అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మొదలు కాబోతున్నట్టుగా ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ అఖిల్ - జైనబ్ ల వివాహం జూన్ 6 న జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి నాగ్ తన చిన్న కొడుకు పెళ్లి ఎలా నిర్వహించబోతున్నారో అనేది చూడాలి. 

Akhil Akkineni And Zainab Ravjdee Wedding In June 2025?

Akkineni Akhil wedding date locked?
akhil