మోహన్ లాల్ తుడరుమ్ ఓటీటీ డేట్ వచ్చేసింది

Much Awaited Film Locks OTT Date

 

మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఏజ్ లోను అద్దరగొట్టేస్తున్నారు. ఈ ఏడాది L 2 ఎంపురాన్ తో మలయాళంలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన మోహన్ లాల్ రెండు నెలలు తిరిగే లోపు తుడరుమ్ తో మలయాళ బాక్సాఫీసునే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులను బిగ్ సర్ ప్రైజ్ చేసారు. మలయాళంలో తుడరుమ్ బ్లాక్ బస్టర్ గా  నిలిచింది. 

పాన్ ఇండియా మూవీ గా విడుదలైన తుడరుమ్ ప్రతి భాషలోనూ ఎలాంటి అంచనాలు లేకుండానే భారీ కలెక్షన్స్ రాబట్టింది. తుడరుమ్ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన తుడరుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ లేట్ అవ్వొచ్చనే ఊహాగానాలు నడిచాయి. మలయాళీలు మాత్రమే కాదు పాన్ ఇండియాలోని ఆడియన్స్ కూడా తుడరుమ్ ఓటీటీ డేట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. తుడరుమ్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న జియో హాట్ స్టార్ ఫైనల్లీ తుడరుమ్ ఓటీటీ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెల అంటే మే 30 నుంచి తుడరుమ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల నుంచి స్ట్రీమింగ్ లోకి రానున్నట్లుగా అనౌన్స్ చేసారు. సో ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీ లో వీక్షించేందుకు సిద్దమైపొండి మరి. 

Thudarum To Stream On Jio Hotstar From May 30

thudarum