రాజా సాబ్ అప్పటివరకు రానట్లేనా

Raja Saab Release Date UpdateRaja Saab Release Date Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం రాజా సాబ్. ద రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియక ప్రభాస్ ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. వచ్చే నెలలో రాజా సాబ్ టీజర్ అంటూ అటు హీరోయిన్ మాళవిక మోహనన్, ఇటు నిర్మాత SKN కన్ ఫర్మ్ గా చెప్పారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. 

కాకపోతే రాజా సాబ్ సెప్టెంబర్ లో రాకపోవచ్చనే ఊహాగానాలతో పాటుగా.. రాజా సాబ్ రిలీజ్ డిసెంబర్ కి వెళ్లొచ్చనే టాక్ మొదలైంది. రాజా సాబ్ టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేయబోతున్నారని, అది డిసెంబర్లో అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. 

రాజా సాబ్ ఖచ్చితంగా సెప్టెంబర్ లేదా ఆక్టోబర్లో వస్తుంది అని నమ్మకంగా ఉంటే కానీ ఇప్పుడు అది డిసెంబర్ అంటున్నారు అని వారిలో ఆందోళన మొదలైంది, మరి జూన్ లో రాజా సాబ్ టీజర్ పాటుగా రిలీజ్ డేట్ కూడా రాబోతుంది. అది ఎప్పుడు అనేది కాస్త వెయిట్ చేస్తే తెలుస్తుంది. 

Raja Saab Teaser Update

raja saab