భైరవం- బెల్లంకొండ రేంజ్ మారుస్తుందా
Will Bhairavam change Bellamkonda rangeకమర్షియల్ మాస్ హీరోగా పేరుపొందిన హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి రూటెడ్ కథతో.. ఓ డిఫరెంట్ లుక్‌తో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భైరవం . డ్యాన్సులు, ఫైట్స్‌ల విషయంలో మంచి పేరు పొందిన ఈ యంగ్ మాస్ హీరో ఈ సారి మరింత రగ్గడ్‌గా, మోర్ ఎమోషన్స్ మిక్స్ అయిన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటి వరకు విడుదలైన భైరవం ప్రమోషన్ కంటెంట్ ట్రైలర్, టీజర్, పాటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనదైన మార్క్‌ను చూపించాడు. పాటల్లో, యాక్షన్ సీక్వెన్సీల్లో ఎంత ఎనర్జీగా కనిపించాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన నటనలో కూడా ఎంతో మెచ్యూరీటీ కనిపిస్తుందని అంటున్నారు సినీ జనాలు. దాదాపు రెండున్నర ఏళ్ల గ్యాప్ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ చిత్రం ఆయన ఖాతాలో సూపర్‌హిట్‌గా నిలుస్తుందని సెన్సారు రిపోర్టు తెలుసుకున్న సినీ ప్రముఖులు మాట.
అంతేకాదు ఈ సినిమాకోసం, ఆ పాత్ర కోసం ఈ హీరో ఎంతో హార్డ్ వర్క్ చేశాడని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందని, ఈ చిత్రం ఆయనకు స్టార్ హీరో రేంజ్ తీసుకొస్తుందని భైరవం యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బెల్లంకొండ ప్రస్తుతం దృష్టంతా భైరవం ప్రమోషన్స్‌పైనే ఉంది. ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవం చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.
Will Bhairavam change Bellamkonda range Will he join the list of Tollywood stars?







































