పోలీసులకు చిక్కిన నటి కస్తూరి

గత వారం రోజులుగా నటి కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. కారణం.. రీసెంట్ గా కస్తూరి చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చెయ్యడంతో ఆమెపై కేసు నమోదు అయ్యింది. కస్తూరిని అరెస్ట్ చెయ్యాలంటూ రాష్ర వ్యాప్తంగా ఆందోళనలు జారిగాయి, కేసు నమోదు చేసిన పోలీసులు కస్తూరికి నోటీసులు జారీ చేసారు. 

గత వారం రోజులుగా కస్తూరి అరెస్ట్ కు భయపడి  అజ్ఞాతంలోకివెళ్ళిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు కస్తూరి పోలీసులకు చిక్కింది. చెన్నై పోలీసులు కస్తూరిని గచ్చిబౌలి లో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల సహకారం తొ చెన్నై పోలీసులు నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. 

Actress Kasturi arrested in Hyderabad

Actress Kasturi arrested
kasturi