గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ డేట్

Gangs of Godavari OTT DateGangs of Godavari OTT Date

విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ మే 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా క్రిటిక్స్ నుంచి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

మొదటి మూడు రోజులు అంటే.. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ రోజు భారీ దెబ్బకొట్టింది. ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించలేదు. ఇక ఈ వారం శర్వానంద్ మనమే లాంటి క్రేజీ చిత్రం వస్తోంది.

అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ డేట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ దాహరకు సొంతం చేసుకోగా..  నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ చిత్రం ఈ నెలలోపే వచ్చే ఛాన్స్ ఉందని టాక్.

Gangs Of Godavari OTT Release Details

gangs of godavari