Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chandrababu Victory - Megastar Abhinandana

చంద్రబాబు విక్టరీ - మెగాస్టార్ అభినందన

Chandrababu Victory - Megastar Abhinandana

2024 ఎన్నికల్లో ఆంధ్రలో క్లీన్ స్వీప్ చేసిన నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగాస్టార్ అభినందిస్తూ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకి అభినందనలు తెలియజేసారు. 

ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు  ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ  మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !

Megastar Chiranjeevi congratulates TDP chief Chandrababu Naidu

chandrababu naidu