కొత్తగా కనబడుతున్న కృతి శెట్టి

కృతి శెట్టి వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరోయిన్. ఒకప్పుడు ట్రెడిషనల్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరై హిట్స్ కొట్టేసి దూసుకుపోయిన కృతి శెట్టికి వరసగా నాలుగైదు ప్లాప్స్ పడడంతో ఇప్పుడు డల్ అయ్యింది. ఆమెది ఐరెన్ లెగ్ అంటూ మాట్లాడుతున్నారు. అయితే క్యూట్ గా స్వీట్ గా మెస్మరైజ్ చేస్తూ ట్రెడిషనల్ కి కేరాఫ్ గా ఉండే కృతి శెట్టి కొద్దిరోజులుగా స్టయిల్ మార్చేసింది. గ్లామర్ గా టర్న్ అయ్యింది. మడికట్టుకుని కూర్చుంటే కష్టం అనుకుందో.. ఏమో.. ఇప్పుడు అందాలు చూపించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది.

సోషల్ మీడియాకి ఎప్పుడూ కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చేసే కృతి శెట్టి ఈమధ్యన తరచూ స్పెషల్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. శారీస్, చుడి డార్స్, బుల్లి ఫ్రాక్స్ ఇలా ఏ అవుట్ ఫిట్ అయినా గ్లామర్ షో ఉండేలా చూసుకుంటుంది. ఏ డ్రెస్ అయినా ఆమెని అందంగా చూపించేదిగా ఉండాలనుకుంటుంది.

తాజాగా రకుల్ - ఫ్లోరల్ ప్రింటెడ్ సిల్క్ శారీలో అందాలు చూపించడమే కాదు.. కత్తిలాంటి ఫోటో షూట్ తో కొత్తగా కనిపించింది. మీరూ కృతి శెట్టి కొత్త లుక్ ని ఓసారి చూసెయ్యండి.

Krithi Shetty in her latest white floral saree

Krithi Shetty looks gorgeous
krithi shetty