RC 15 టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Interesting news on RC15 title

ఆర్.ఆర్.ఆర్ తరవాత టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC15 ని మొదలు పెట్టి ఏడాదిన్నర పూర్తవుతున్నా ఈ చిత్రానికి సంబందించిన ఏ ఒక్క అప్ డేట్ ఇంతవరకు అధికారికంగా వచ్చింది లేదు. ఈ విషయంలో దిల్ రాజు కూడా ఏమి చెయ్యలేక గమ్మున చూస్తున్నాడు కానీ.. ఈ సినిమా అప్ డేట్ విషయం పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ కూడా ఆడుతూ పాడుతూ షూటింగ్ చేసుకుంటూ మధ్యలో విహారయాత్రలు, ఆర్.ఆర్.ఆర్ అవార్డ్స్ వేడుకలంటూ హడావిడిగా తిరుగుతున్నాడు.

శంకర్ అటు చరణ్ సినిమా ఇటు కమల్ సినిమా అంటూ ఆయన బిజీ ఆయనది. కానీ మెగా ఫాన్స్ RC15 లుక్ విషయంలో జరిగే జాప్యానికి తట్టుకోలేక లొకేషన్ నుండి రామ్ చరణ్ లుక్ కి సంబందించిన పిక్స్ లీక్ చేసి వైరల్ చేస్తున్నారు.. అయినా శంకర్ దానిని సిరీస్ గా తీసుకోవడం లేదు. ఇక చరణ్ పుట్టిన రోజు మార్చ్ 27 న RC 15 ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రివీల్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

విలన్ గా SJ సూర్య కనిపించబోతున్న ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తుంది. ఇంతకుముందు సర్కారోడు టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్-శంకర్ మూవీకి 'సి ఈ ఓ' టైటిల్ ని మేకర్స్ లాక్ చేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ ని రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా మార్చి 26 ఈవెనింగ్ 6 గంటలకి రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Crazy news on RC15 title

ram charan
rc15