Advertisementt

కీర్తి సురేష్ న్యూ లుక్

Sun 19th Feb 2023 01:02 PM
keerthy suresh new look  కీర్తి సురేష్ న్యూ లుక్
Keerthy Suresh new look కీర్తి సురేష్ న్యూ లుక్
Advertisement
Ads by CJ

కొద్దిరాజులుగా మహానటి కీర్తి సురేష్ మోడరన్ లుక్ లో సందడి చేస్తుంది. ట్రెడిషనల్ గా ఉండే కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ గేట్స్ ఎత్తెయ్యడానికి రెడీ అవడమే కాదు, సోషల్ మీడియాలో ఆ పని ఎప్పుడో మొదలు పెట్టేసింది. సర్కారు వారి పాటలో కొత్త అవతారంలో కనిపించింది. గ్లామర్ గర్ల్ గా టర్న్ తీసుకున్న కీర్తి సురేష్ బరువు తగ్గి మొహం లో కళ కోల్పోయినా.. లుక్స్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటుంది. గ్లామర్ ఫోటో షూట్స్ తో యూత్ కి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది.

ఈమధ్యన కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ జస్ట్ రూమర్స్ అని తేల్చేసిన కీర్తి సురేష్ తాజా లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది. బ్యూటిఫుల్ గా జీన్స్ అండ్ టాప్ లోను, పూల పూల ఫ్రాక్ లోను కత్తిలా కనిపించింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈవెంట్ కోసం కీర్తి సురేష్ ముంబై వెళ్ళింది. ఆ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై కనిపించిన ఆమె గ్లామర్ గా అందంగా ఉంది. రెండు రకాల కీర్తి సురేష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరు భోళా శంకర్ లో చిరుకి సిస్టర్ గా కనిపిస్తున్న కీర్తి సురేష్ నానితో నటించిన దసరా రిలీజ్ కి రెడీ అయ్యింది.

Keerthy Suresh new look:

Keerthy Suresh new modern look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ