Advertisementt

పెళ్లి విషయంలో రూమర్స్: క్లారిటీ ఇచ్చిన పూర్ణ

Wed 10th Aug 2022 11:26 AM
actress poorna,poorna engagement,poorna wedding  పెళ్లి విషయంలో రూమర్స్: క్లారిటీ ఇచ్చిన పూర్ణ
Actress Poorna Gives Clarity About Her Marriage rumours పెళ్లి విషయంలో రూమర్స్: క్లారిటీ ఇచ్చిన పూర్ణ
Advertisement
Ads by CJ

దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ అసిఫ్ అలీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి పూర్ణ.. పెళ్లి చేసుకోబోతుంది అన్న తరుణంలో పూర్ణ నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుని పెళ్లిని ఆపేసింది అనే ఓ పుకారు సోషల్ మీడియాలో షికారు చేసింది. కారణాలు తెలియవు, సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా డిలేట్ చెయ్యలేదు, అయినా పూర్ణ నిశ్చితార్ధం బ్రేకప్ రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దానితో తాజాగా పూర్ణ తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది.

అసిఫ్ అలీతో దిగిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ Forever Mine అంటూ తన పెళ్లి క్యాన్సిల్ విషయంలో వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం బుల్లితెర షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తూ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ లతో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా అఖండ చిత్రంలోని కీలక పాత్రతో బిగ్ స్క్రీన్ వైజ్ కూడా బిగ్ బ్రేక్ పొందిన పూర్ణ సడన్ గా జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ అయిన అసిఫ్ అలీతో తనకి పెళ్లి సెటిల్ అయినట్లుగా చెబుతూ ఆ వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ మధుర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో కూడా పంచుకుంది.

👉  కాబోయే భర్తతో కనిపించి పెళ్లి కబురు చెప్పిన పూర్ణ 

Actress Poorna Gives Clarity About Her Marriage rumours :

Actress Poorna Gives Clarity About Her Engagement Breakup

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ