Advertisementt

పెళ్లి పీటలెక్కబోతున్న నటి పూర్ణ

Wed 01st Jun 2022 02:38 PM
actress purnaa,poorna,purna engaged,purna weds asifali,asifali  పెళ్లి పీటలెక్కబోతున్న నటి పూర్ణ
Actress Purnaa got engaged పెళ్లి పీటలెక్కబోతున్న నటి పూర్ణ
Advertisement
Ads by CJ

అవును సినిమాతో హీరోయిన్ గా ఫెమస్ అయిన పూర్ణ కి తెలుగులో పేరు తెచ్చేంతగా ఆమెకి సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. రీసెంట్ గా అఖండ మూవీలో పూర్ణ మంచి పాత్రని చేసింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో.. వెండితెర మీద ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూనే టివి షోస్ కి పరిమితమైంది పూర్ణ. ఈటీవీలో ఢీ డాన్స్ షో కి కొన్నాళ్ళు జేడ్జ్ గా పని చేసింది. తర్వాత జబర్దస్త్ లోను, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలోను, స్టార్ మా కామెడీ స్టార్స్ లోను వన్ అఫ్ ద జేడ్జ్ గా కనిపిస్తుంది. అటు సినిమా అవకాశాలు తగ్గాయి. సుందరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూర్ణని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

ఇక పూర్ణ కి అటు సినిమా అవకాశాలు, ఇటు టివి షోస్ తగ్గడంతో పెళ్ళికి రెడీ అయ్యింది. తనకి కాబోయే వాడిని సోషల్ మీడియా సాక్షిగా పరిచయం చేసింది. ప్రముఖ జెబిఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని పూర్ణ వివాహా చేసుకోబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. పూర్ణ ఇలా కాబోయే వాడిని పరిచయం చేసిందో లేదో.. క్షణాల్లో ఆ వార్త వైరల్ అయ్యింది. పూర్ణ పెళ్లి వార్త చూసిన ఆమె ఫ్రెండ్స్, సన్నిహితులు, సినిమా ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Actress Purnaa got engaged :

Actress Purnaa got engaged to Asifali 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ