Advertisementt

ఎన్టీఆర్ పై వస్తున్నవన్నీ రూమర్సేనట

Tue 09th Aug 2022 09:34 PM
tarak,ntr,ntr30,koratala  ఎన్టీఆర్ పై వస్తున్నవన్నీ రూమర్సేనట
Shoulder pain issues to Jr NTR? ఎన్టీఆర్ పై వస్తున్నవన్నీ రూమర్సేనట
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో NTR30 మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా నెలలు గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ లోను రోజురోజుకి అసంతృప్తి పెరిగిపోతుంది. కానీ NTR30 అప్ డేట్ మాత్రం వదలడం లేదు. ఈమధ్యన NTR30 దసరా పండగకి పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఆయనకి భుజం నొప్పి ఎక్కువైన కారణంగా నాలుగు వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పడంతో ఎన్టీఆర్ విశ్రాంతిలో ఉన్నారంటూ ఏవేవో న్యూస్ లు ఆయన ఆరోగ్యంపై చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కి ఎలాంటి విశ్రాంతి అక్కర్లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం వలన NTR30 వాయిదా పడలేదని, ఆయన ప్రస్తుతం ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ చేస్తున్నారని, కొరటాల సినిమా మొదలు పెట్టేలోగా ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క బుచ్చిబాబు సినిమాని కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాతో పాటుగా చేయబోతున్నారనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

🎇 Nandamuri family rewriting Tollywood Story

Shoulder pain issues to Jr NTR?:

Rumours on NTR Shoulder pain issues

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ