Advertisementt

బిగ్ బాస్ 6 ప్రోమో.. నాగార్జున అదుర్స్

Tue 09th Aug 2022 09:46 AM
bigg boss,bigg boss 6,nagarjuna,bigg boss 6 promo  బిగ్ బాస్ 6 ప్రోమో.. నాగార్జున అదుర్స్
Bigg Boss 6 Promo released బిగ్ బాస్ 6 ప్రోమో.. నాగార్జున అదుర్స్
Advertisement
Ads by CJ

నార్త్ లో అంత సక్సెస్ కాకపోయినా.. సౌత్ లోను బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తున్న బిగ్ బాస్ ప్రతి ఏడాది ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త ఫేస్ లు, హౌస్ లో కొట్లాటలు, ప్రేమలు, టాస్క్ లతో హోరా హోరి యుద్దాన్ని చూసేందుకు ఆడియన్స్ అలెర్ట్ అయిపోతారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఓటిటిలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 కోసం రంగం సిద్ధమైపోయింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బిగ్ బాస్ లోగో వచ్చిన వారం లోపే ప్రోమోని వదిలి షో పై హైప్ క్రియేట్ చేసారు. 

బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కోసం గ్రాండ్ గా ఓ పెళ్లి సెటప్ వేశారు. గ్రాండ్ గా పెళ్లి జరిగాక అమ్మాయిని అత్తారింటికి పంపేందుకు తల్లితండ్రులు బాధపడుతున్నారు. కొత్త పెళ్లి కూతురు కూడా మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు అని ఏడుస్తుంది. ఇంతలోపులో ఫోన్ లో బిగ్ బాస్ అనౌన్సమెంట్ రాగానే.. అక్కడినుండి అందరూ మాయం.. టీవీలకు అతుక్కుపోవడం.. నాగార్జున ఎంట్రీ.. అన్ని సూపరే. మై డియర్ అంటూ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అప్పగింతలయ్యేవరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. బిగ్ బాస్ సీజన్ 6-ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటూ నాగ్ బిగ్ బాస్ సీజన్ 6 కమింగ్ సూన్ ప్రోమోతో అదరగొట్టేసారు.  

 

Bigg Boss 6 Promo released:

Bigg Boss 6 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ