బాలీవుడ్ లో కరణ్ జోహార్ హోస్ట్ గా కాఫీ విత్ కరణ షో ఇప్పటివరకు టివి షోస్ లో టాప్ గా నిలవగా ఇప్పుడు ఓటిటి వేదికపై ప్రసారమవుతుంది. కరణ్ జోహార్ స్టార్ నటీనటులని షో కి గెస్ట్ గా ఆహ్వానించి వారి వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టడమే కాదు, వారు జవాబు కూడా చెప్పలేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం ఈ సీజన్ లో చూస్తున్నాం. సమంత ని విడాకుల విషయంలో టార్గెట్ చెయ్యగా.. విజయ్ దేవరకొండని సెక్స్ లైఫ్ విషయంలో టార్గెట్ చేసాడు. ఇక సమంత, కరీనా కపూర్ ల మాజీ లవర్స్ విషయంలో ఇబ్బంది పెట్టారు. అలియా భట్ ని ఫస్ట్ నైట్ ప్రశ్నలు అడిగాడు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షో పై హీరోయిన్ తాప్సి సెటేరికల్ కామెంట్స్ చేసింది. దోబారా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి ని మీకు ఎంతో పాపులర్ అయిన కాఫీ విత్ కరణ్ షో కి ఆహ్వానం అందలేదా అని ప్రశ్నించారు.
దానికి తాప్సి వెటకారంగా కాఫీ విత్ కరణ్ కి ఆహ్వానించేలా నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు అంటూ చెప్పడం చూసిన వారంతా షాకయ్యారు. అంటే తాప్సి కావాలనే కరణ్ విత్ కాఫీ షో పై, కరణ్ జోహార్ పై సెటేరికల్ కామెంట్స్ చేసింది అని, తాప్సి చెప్పడమే కాదు, నిజంగానే కరణ్ జోహార్ సినిమాల ప్రమోషన్స్ వదిలేసి.. నటుల సెక్స్ లైఫ్ ఆధారంగానే ప్రశ్నలు సంధించడం ఓ వర్గం ఆడియన్స్ కి నచ్చడం లేదు. అందుకే తాప్సి చేసిన కామెంట్స్ కి కొంతమంది నెటిజెన్స్ మద్దతు కూడా తెలుపుతున్నారు.