Advertisementt

నిత్య మీనన్ పై సంతోష్ వర్కి ఆరోపణలు

Sun 07th Aug 2022 04:27 PM
santosh varkey,nithya menen,nithya menon  నిత్య మీనన్ పై సంతోష్ వర్కి ఆరోపణలు
Nithya Menen vs Santosh Varkey నిత్య మీనన్ పై సంతోష్ వర్కి ఆరోపణలు
Advertisement
Ads by CJ

నెల రోజుల క్రితం నటి నిత్యా మీనన్ పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ వచ్చిన రూమర్స్ కి నిత్యా మీనన్ చాలా త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు అంటూ స్పందించింది. తాజాగా నిత్యా మీనన్ తనని సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతొ వేధించాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సంతోష్ వర్కి అనే అతను తనని ఓ 30 రకాల ఫోన్ నెంబర్లు తో ఫోన్ చేసి విసిగిస్తూ, వేధించాడని, ఆరెళ్లపాటు నరకం చూశాయి అంటూ కామెంట్స్ చేసింది. అయితే నిత్యా మీనన్ కామెంట్స్ పై సంతోష్ వర్కి కూడా స్పందించాడు.

నిత్యా మీనన్ తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఒక వ్యక్తి ఎన్ని పేర్లతో సిమ్ కార్డులు తీసుకుంటాడో అనేది జనాల విజ్ఞతకే వదిలేస్తున్నాను అని, నిత్యా మీనన్ కి గతంలోనే ఎంగేజ్మెంట్ జరిగింది అని ఆమె తల్లి చెబితే, తండ్రి మాత్రం జరగలేదని చెప్పారు, అలాగే నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టారు. గతంలో నిత్యా మీనన్ ని వివాహం చేసుకోవాలనుకున్న మాట నిజమే అని, కానీ ఇప్పుడు నిత్యా మీనన్ ని అస్సలు పెళ్లి చేసుకోను, నిత్యా మీనన్ గురించి ముందే తెలిస్తే ఆమెని అసలు ప్రేమించేవాడినే కాదు అంటూ సంతోష్ వర్కి షాకింగ్ కామెంట్స్ చెయ్యడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Click Here For glamorous pictures of Nithya Menon 

Nithya Menen vs Santosh Varkey:

Santosh Varkey sensational comments on Nithya Menen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ