Advertisementt

అనవసరంగా అతి చేస్తున్నారు

Sun 07th Aug 2022 01:24 PM
mega fans,nandamuri fans,megastar kalyanram,kalyan ram,twitter  అనవసరంగా అతి చేస్తున్నారు
Mega fans vs Nandamuri fans అనవసరంగా అతి చేస్తున్నారు
Advertisement
Ads by CJ

ఫాన్స్ ఒక్కోసారి మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా సిల్లీ రీజన్స్ తో ఒకరి మీద ఒకరు మాటల యుద్దానికి దిగుతారు. టాలీవుడ్ హీరోలు ఎంతో ఫ్రెండ్లి గా ఉన్నప్పటికీ, ఫాన్స్ వార్ మాత్రం ఆగడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రెండ్స్.. అయినా వారి ఫాన్స్ మధ్యన ఎన్నో గొడవలు. ఇలా ఫాన్స్ అతి చేస్తూనే ఉంటారు. తాజాగా మెగా ఫాన్స్ vs నందమూరి ఫాన్స్ అన్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ ఉంది. కళ్యాణ్ రామ్ బింబిసారా తో హిట్ కొట్టడంతో నందమూరి ఫాన్స్ కాస్త రెచ్చిపోయి #MegastarKalyanram హాష్ టాగ్ ట్రెండ్ చెయ్యడంతో మెగా ఫాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. 

మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అయితే మెగాస్టార్ చిరు ఏమవుతారు. అయినా ఒక్క హిట్ కే అన్ని కొమ్ములు వచ్చాయా.. అంత బలుపా అంటూ మెగా ఫాన్స్ కళ్యాణ్ రామ్, నందమూరి ఫాన్స్ పై చిందులు తొక్కుతున్నారు. వరస డిజాస్టర్స్ ఉన్న కళ్యాణ్ రామ్ కి గుడ్డిలో మెల్లలా ఓ హిట్ పడింది దానికే ఇంతలా రెచ్చిపోతున్నారు.. మీరెంత, మీ హిట్స్ ఎంత అంటూ మెగా ఫాన్స్ ఏసుకుంటుంటే.. నందమూరి ఫాన్స్ మాత్రం ఆచార్య సినిమాని ట్రోల్ చేస్తూ రచ్చ చెయ్యడం చూసిన నెటిజెన్స్ అభిమానులు అతి తగ్గించుకుంటే బావుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అభిమానులు ఎప్పటికి మారాలి అంటూ ఇంకొందరు మాట్లాడుతున్నారు.

- బింబిసార విజయం పట్ల చిరంజీవి స్పందన -

Mega fans vs Nandamuri fans:

MegastarKalyanRam hash trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ