Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Disappointed news for Mahesh Babu fans

మహేష్ ఫాన్స్ కి నిరాశే మిగిలింది

Disappointed news for Mahesh Babu fans

ఈ నెలలో మహేష్ ఫాన్స్ సర్కారు వారి పాట సక్సెస్ తో మహేష్ ఫాన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ఆ సినిమా విజయం మహేష్ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అయినప్పటికీ మహేష్ ఫాన్స్ కృష్ణగారి పుట్టిన రోజునాడు మహేష్ కొత్త సినిమా SSMB28 నుండి రాబోయే అప్ డేట్ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు మే 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఆయన బర్త్ డే కి ఇండస్ట్రీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క మహేష్ ఫాన్స్ కృష్ణ గారి బర్త్ డే కేక్ కట్ చేసారు.

అంతా బాగానే ఉన్నా SSMB28 అప్ డేట్ కోసం మాత్రం ఆత్రంగానే ఉన్నారు. కానీ SSMB28 టీం కృష్ణగారి పిక్ తో విషెస్ పెట్టేసి చేతులు దులిపేసుకుంది. మహేష్ బాబు కూడా ఈ అప్ డేట్ పై కామ్ గా ఉన్నారు. త్రివిక్రమ్ కూడా మరింత సైలెంట్ మెయింటింగ్ చేస్తున్నారు కానీ.. ఆ అప్ డేట్ పై ఎలాంటి న్యూస్ ఇవ్వలేదు. మరి జూన్ లోనే మొదలు కాబోయే SSMB28 నుండి అప్ డేట్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. మహేష్ లుక్ కానీ, మహేష్ మూవీ టైటిల్ కానీ ఇవ్వొచ్చు. కానీ త్రివిక్రమ్ ఎందుకు కామ్ గా ఉన్నారో ఫాన్స్ కి అర్ధం కావడం లేదు. మరోపక్క మహేష్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని ఇంకా మెచ్చలేదు అందుకే త్రివిక్రమ్ ఆ పనిలో బిజీగా ఉండి.. ఈ అప్ డేట్ ని ఆయన లైట్ తీసుకున్నారని మరో టాక్. ఏది ఏమైనా మహేష్ SSMB28 అప్ డేట్ రాకపోవడం మహేష్ ఫాన్స్ నిరాశ పడిపోతున్నారు.

Mahesh Fans Disappointed

mahesh
mahesh fans
krishna birthday
ssmb28
trivikram
ssmb 28