ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

Srinu Vaitla father passes away

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు

Srinu Vaitla suffers a personal loss

srinu vaitla
father passes away
tollywood celebrities
dhee sequel
manchu vishnu
dhee ante dhee