Loading...

ఆర్.ఆర్.ఆర్ కి ఆమె ప్రత్యేకం

Alia Bhatt Special Package for RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ కి సంబందించిన విషయాలను జక్కన్న తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ తో అభినులతో, ప్రేక్షకులతో పంచుకుకుంటున్న విషయం తెలిసిందే. నిన్నగాక మొన్న ఆర్.ఆర్.ఆర్ ఫైట్ సీన్స్ చూస్తే గూస్ బంబ్స్ కాదు, ఎమోషనల్ గా కన్నీళ్ళు తెప్పిస్తాయంటూ చెప్పిన ఆయన ఇంకా సినిమాకి సంబందించిన క్లైమాక్స్ షూటింగ్ మిగిలే ఉంది అని చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ పై విజయేంద్ర మాటలు అంచనాలు పెంచేస్తుంటే.. ఇప్పుడు మరోసారి..

ఈ సినిమాలో సీత పాత్రధారి అలియా భట్ గురించి మాట్లాడి మరింత హైప్ క్రియేట్ చేసాడు. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ రోల్ చాలా తక్కువ నిడివి కలిగి ఉంటుంది అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కరెక్ట్ అని, అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ లో కనిపించేది తక్కువే అయినా.. ఆమె పాత్ర ఆర్.ఆర్.ఆర్ కి చాలా స్పెషల్ అంటున్నారు ఆయన. ఆమె రోల్ ఉన్నంతసేపు అలియా భట్ ప్రతి సీన్ లో కనిపిస్తుంది అని.. ఆర్.ఆర్. ఆర్ కి అలియా భట్ స్పెషల్ ప్యాకేజ్ అంటూ సీత పాత్రపై అంచనాలు పెంచేశారు. అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కి పెయిర్ గా అలియా భట్ కనిపిస్తుంది. మరి అంత స్పెషల్ కాబట్టే బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యుండి చిన్నరోల్ అయినా అలియా భట్ రాజమౌళి అడిగారని ఒప్పుకుంది.

RRR writer about Alia Bhatt role

rrr movie
rrr pan india movie
rrr writer
vijayendra prasad
alia bhatt role