ప్రేమికుల రోజున ‘లవ్ స్టోరీ’ నుంచి సర్‌ప్రైజ్!

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలినారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పైనారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండగ రోజు ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న టీమ్ ఇప్పుడు ప్రేమికులరోజున మరో సర్‌ప్రైజ్‌తో రాబోతుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుంచి 1 మినిట్ ‘మ్యూజికల్ ప్రివ్యూ’ రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఫిబ్రవరి 14న ఉదయం 11: 07 గంటలకు సినిమాలోని మొదటిపాట ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూని రిలీజ్ చేయబోతుంది. ఏఆర్ రెహమాన్ స్కూల్ నుంచి పరిచయమవుతున్న పవన్ సి.హెచ్ అందించిన స్వరాలు ఈలవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతోంది.
‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథఅక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతుంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సహా నిర్మాత : భాస్కర్ కటకం శెట్టి
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియ
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.
Love Story Surprise On Lovers Day
Love Story Surprise On Lovers Day







































